Share News

దాడి కేసులో తండ్రీకొడుకులకు ఐదేళ్ల జైలు

ABN , Publish Date - Feb 07 , 2025 | 01:41 AM

దాడి కేసులో తండ్రీకొడుకులకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు పుంగనూరులోని గంగులయ్య కుమార్తె రోజాతో పదేళ్ల క్రితం వివాహమైంది.

దాడి కేసులో తండ్రీకొడుకులకు ఐదేళ్ల జైలు
శ్రావణ్‌కుమార్‌, సుబ్రహ్మణ్యం

చిత్తూరు లీగల్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): దాడి కేసులో తండ్రీకొడుకులకు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. బంగారుపాళ్యం మండలం టేకుమంద గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు శ్రావణ్‌కుమార్‌కు పుంగనూరులోని గంగులయ్య కుమార్తె రోజాతో పదేళ్ల క్రితం వివాహమైంది. శ్రావణ్‌కుమార్‌ నిత్యం మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. 2022 జూలై 18వ తేదీన రోజా కుటుంబీకులకు ఫోన్‌చేసి మీ కూతుర్ని తీసుకెళ్లిపోండని బెదిరించాడు. దాంతో వారు అదేరోజున టేకుమందకు చేరుకుని శ్రావణ్‌కుమార్‌ను ఏం జరిగిందని అడిగారు. ఈ సమయంలో తన తండ్రి సుబ్రహ్మణ్యంతోకలిసి భార్య కుటుంబీకులపై కత్తులతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. దీనిపై బాధితులు ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రావణ్‌కుమార్‌, సుబ్రహ్మణ్యంలపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు గురువారం పీఎ్‌సజే కోర్టులో వాయిదాకురాగా, నేరం రుజువైంది. దీంతో వారిద్దరికీ ఐదేళ్ల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఎంవీఎస్‌ పద్మజ తీర్పుచెప్పారు. ఈ కేసును పీపీ శైలజ వాదించారు.

గృహహింస కేసులో ముగ్గురికి మూడేళ్ల జైలు

వడమాలపేట, ఫిబ్రవరి 6(ఆంధ్రజోతి): గృహహింస, అదనపు కట్న వేధింపుల కేసులో ముగ్గురికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా విధించినట్లు వడమాలపేట ఎస్‌ఐ ధర్మారెడ్డి తెలిపారు. పత్తి పుత్తూరు పంచాయతీ అమ్మగుంట గ్రామానికి చెందిన శ్రీవాణి 2016లో తన భర్త మదనమోహన్‌ రెడ్డి, అత్త నాగమ్మ, ఆడబిడ్డ రాజ్యలక్ష్మి, మామ సుబ్బారెడ్డి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, గృహహింసకు పాల్పడుతున్నారని వడమాలపేట పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు కాగా పుత్తూరు కోర్టులో విచారణ సాగింది. 2019లో మదనమోహన్‌ రెడ్డి మృతి చెందగా మిగిలిన ముద్దాయిలైన నాగమ్మ, రాజ్యలక్ష్మి, సుబ్బారెడ్డిలకు పుత్తూరు జేఎ్‌ఫసీఎం కోర్టు మెజిస్ట్రేట్‌ గోపాలకృష్ణ మూడు సంవత్సరాల జైలుశిక్ష, ఇద్దరు మహిళలకు రూ.8000 చొప్పన, సుబ్బారెడ్డికి రూ.9000 అపరాధ రుసుం విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ఏపీపీ నిర్మల కేసు వాదించారు.

Updated Date - Feb 07 , 2025 | 01:41 AM