Share News

Family Passedaway: తిరుపతిలో విషాదం.. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం!

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:49 PM

Family Passedaway: తిరుపతి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ కుటుంబం మెుత్తం ఆత్మహత్యకు పాల్పడింది. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లిన నలుగురు కుటుంబసభ్యులు బావిలోకి దూకారు.

Family Passedaway: తిరుపతిలో విషాదం.. బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం!

తిరుపతి, జులై 17: జిల్లాలో ఘోర విషాద ఘటన వెలుగు చూసింది. చంద్రగిరి (Tirupati) నియోజకవర్గం పాకాల మండలం మద్దినాయనపల్లి పంచాయతీ పెద్ద హరిజనవాడలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబసభ్యులు నలుగురు ఒకేసారి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వారంతా బావిలోకి దూకడాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే నలుగురిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.


తల్లి హేమలత, చిన్న పాప తేజశ్రీ మృతదేహాలను బయటకు తెచ్చారు స్థానికులు. తండ్రి గిరి కొనఊపిరితో ఉండగా 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పెద్ద కూతురు తనుశ్రీ మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఈ ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమని తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

హంద్రీ - నీవా కాల్వలకు నీరు విడుదల

జగన్ వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం ఫైర్

Updated Date - Jul 17 , 2025 | 06:30 PM