Share News

అంతంతమాత్రంగా టమోటా ధరలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:16 AM

పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు అంతంతమాత్రంగా పలుకుతున్నాయి. టమోటా బాక్స్‌ ధర (10 కిలోలు) రూ.120 నుంచి రూ.140లోపే ఉంటోంది. నాలుగైదు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది.

అంతంతమాత్రంగా టమోటా ధరలు

నెలరోజులుగా కిలో రూ.12

ఆందోళనలో రైతులు

పలమనేరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు అంతంతమాత్రంగా పలుకుతున్నాయి. టమోటా బాక్స్‌ ధర (10 కిలోలు) రూ.120 నుంచి రూ.140లోపే ఉంటోంది. నాలుగైదు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొంది. మార్కెట్‌కు పెద్ద ఎత్తున టమోటాలు రాకపోయినప్పటికీ ధరలు మాత్రం పెరగక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు ధరలు పెరిగిపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకప్పుడు బాక్సు రూ.200 ధర పలికినా పెట్టుబడి అయినా చేతికి వచ్చిందని తృప్తి పడేవారు. ప్రస్తుతం బాక్సు ధర రూ.350-400 వరకు పలికినా పెట్టుబడులు చేతికందని పరిస్థితి నెలకొంది.

Updated Date - Feb 24 , 2025 | 02:16 AM