Share News

మాజీ ఎంపీ ఆదికేశవులు ఇంట్లో భారీ చోరీ

ABN , Publish Date - Jan 24 , 2025 | 01:50 AM

దివంగత మాజీ ఎంపీ, ఆదికేశవులుకు చెందిన బెంగళూరులోని ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి కుటుంబీకులు ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో బయటకు వచ్చింది.

మాజీ ఎంపీ ఆదికేశవులు ఇంట్లో భారీ చోరీ

చిత్తూరు అర్బన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ఎంపీ, ఆదికేశవులుకు చెందిన బెంగళూరులోని ఇంట్లో భారీ చోరీ జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వారి కుటుంబీకులు ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ విషయంలో బయటకు వచ్చింది. మూడ్రోజుల కిందట పెద్ద మొత్తంలో చోరీ జరిగిందని, ఇది చేసింది తమ ఇంట్లో పనిచేస్తున్న గంగాధరనెల్లూరుకు చెందినవారిగా ఆదికేశవులు కుటుంబీకులు గుర్తించారు. దీనిపై రెండ్రోజుల కిందట ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సంబంధిత సీసీ ఫుటేజీని కూడా అందించారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ స్థాయిలో ప్రత్యేకంగా పనిచేస్తున్న బృందాన్ని ఈ చోరీ విషయాన్ని తేల్చాలని ఎస్పీ ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే దొంగలు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో నిందితులను మీడియాకు చూపించే అవకాశం ఉంది.

Updated Date - Jan 24 , 2025 | 01:50 AM