Share News

గజ గజ.. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

ABN , Publish Date - Jan 20 , 2025 | 01:30 AM

చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు చెలరేగిపోతున్నాయి. తాజాగా శనివారం రాత్రి శేషాపురంలో వీటి బారిన పడి కందులవారిపల్లె ఉప సర్పంచి రాకేష్‌ చౌదరి(33) దుర్మరణం చెందారు. సాధారణంగా ఏనుగులు మామిడికాయల సీజన్‌లో (ఏప్రిల్‌, మే నెలల్లో) ఇక్కడి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించేవి. పంటలను ధ్వంసం చేసేవి. గత ఏడాది నవంబరు నెలాఖరులో చిత్తూరు జిల్లా పలమనేరు, కుప్పం ప్రాంతాల నుంచి 17 ఏనుగులు దామలచెరువు, పులిచెర్ల మండలాల మీదుగా చిన్నగొట్టిగల్లు మండలంలోకి చొరబడ్డాయి. నెల్లుట్లవారిపల్లె, భాకరాపేట పంచాయతీలోని ఎగువూరు, దిగువూరు గ్రామాల్లో పంటలను ధ్వంసం చేశాయి. సుమారు 70 ఎకరాల మామిడి, టమోటా, చెరకు పంటలను, కొబ్బరి చెట్లను నాశనం చేశాయి. దామలచెరువు పంచాయతీలోని మొరవపల్లె పదిపుట్లబైలు, ఈపాలగుట్టపల్లి, వల్లివేడు పరిసరాల్లో వరి, ఉద్యాన పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు కొద్ది రోజులుగా రాత్రి వేళ పొలాల వైపు వెళ్ళేందుకు భయపడుతున్నారు.

గజ గజ.. పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు
ఏనుగుల దాడిలో దెబ్బతిన్న పంటలు (ఫైల్‌ ఫొటో)

గజ గజ

ఫ పంటలను ధ్వంసం చేస్తున్న ఏనుగులు

ఫ తాజాగా గజరాజుల దాడిలో మరణించిన ఉప సర్పంచ్‌

ఫ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్న రైతులు

ఫ శాశ్వత రక్షణకు చర్యలేవీ?

చంద్రగిరి, జనవరి 19(జనవరి): చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు చెలరేగిపోతున్నాయి. తాజాగా శనివారం రాత్రి శేషాపురంలో వీటి బారిన పడి కందులవారిపల్లె ఉప సర్పంచి రాకేష్‌ చౌదరి(33) దుర్మరణం చెందారు. సాధారణంగా ఏనుగులు మామిడికాయల సీజన్‌లో (ఏప్రిల్‌, మే నెలల్లో) ఇక్కడి అటవీ సరిహద్దు ప్రాంతాల్లో సంచరించేవి. పంటలను ధ్వంసం చేసేవి. గత ఏడాది నవంబరు నెలాఖరులో చిత్తూరు జిల్లా పలమనేరు, కుప్పం ప్రాంతాల నుంచి 17 ఏనుగులు దామలచెరువు, పులిచెర్ల మండలాల మీదుగా చిన్నగొట్టిగల్లు మండలంలోకి చొరబడ్డాయి. నెల్లుట్లవారిపల్లె, భాకరాపేట పంచాయతీలోని ఎగువూరు, దిగువూరు గ్రామాల్లో పంటలను ధ్వంసం చేశాయి. సుమారు 70 ఎకరాల మామిడి, టమోటా, చెరకు పంటలను, కొబ్బరి చెట్లను నాశనం చేశాయి. దామలచెరువు పంచాయతీలోని మొరవపల్లె పదిపుట్లబైలు, ఈపాలగుట్టపల్లి, వల్లివేడు పరిసరాల్లో వరి, ఉద్యాన పంటలను ధ్వంసం చేశాయి. దీంతో రైతులు కొద్ది రోజులుగా రాత్రి వేళ పొలాల వైపు వెళ్ళేందుకు భయపడుతున్నారు.

నాలుగు రోజులుగా అలజడి

గడచిన నాలుగు రోజులుగా ఏనుగులు దేవరకొండ దాటి శేషాచల అడవుల్లోని అంకాలమ్మ గుడి, కల్యాణి డ్యామ్‌లకు చేరుకున్నాయి. డ్యామ్‌ మీదుగా రాత్రి పూట నారావారిపల్లె, శేషాపురం, భీమవరం అటవీ ప్రాంత సమీపంలోని పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అటవీ అధికారులు వీటిని అడవిలోకి మళ్లించేందుకు విఫలయత్నం చేస్తున్నారు. గతంలో వేసవిలో తాగునీటి కోసం డ్యామ్‌కు వచ్చి, పంటలను ధ్వంసం చేసేవి. ఇప్పుడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఏనుగులు గతంలో సంచరించిన ప్రాంతాన్ని గుర్తించలేక దారి తప్పి తిరుగుతున్నట్లు తెలిసింది. దీంతో ఈప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. మున్నెన్నడూ లేనివిధంగా చంద్రగిరి మండలంలో ఏనుగులు దాడిచేసి ఉపసర్పంచ్‌ రాకే్‌షను పొట్టనబెట్టుకోవడంతో స్థానికులు హడలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత మండలం కావడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి గజరాజులను కట్టడి చేసి ఊరట కలిగించాలని కోరుతున్నారు.

సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు ఎప్పుడు.?

శేషాచల అడవుల్లో నుంచి పొలాల్లోకి ఏనుగులు రాకుండా సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నా చర్యలు తీసుకోవడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో అప్పటి మంత్రి గల్లా అరుణకుమారి సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అదేసమయంలో రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో ఫెన్సింగ్‌ ప్రతిపాదన మరుగున పడింది. గత వైసీపీ ప్రభుత్వంలో కనీసం ఆ ప్రస్తావనే తేలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే నాని ఇటీవల అసెంబ్లీ సమావేశాలల్లో ఈ సమస్యను లేవనెత్తారు. ఇప్పటికైనా ఫెన్సింగ్‌ ఏర్పాటుకు కదలిక వస్తుందని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

ఏనుగుల కట్టడికి రెండు మార్గాలు

ఏనుగుల సమస్యకు ట్రాంక్విలేజర్‌(మత్తు ఇవ్వడం).. కుంకీ ఏనుగులను రప్పించడం పరిష్కార మార్గాలని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఏనుగులు పంటలను ధ్వంసం చేసినా, సమీపంలో సంచరిస్తున్నా గుర్తించి అటవీ సిబ్బంది వాటికి మత్తు ఇంజెక్షను వేయాల్సి ఉంటుంది. మత్తులో ఉండగా వాటిని దూర ప్రాంతాలకు తరలించాలి. లేదా శిక్షణ పొందిన కుంకీ ఏనుగుల ద్వారా వాటిని మళ్లీ గమ్యస్థానానికి (పాత స్థావరాలు) చేర్చవచ్చంటున్నారు.

Updated Date - Jan 20 , 2025 | 01:30 AM