Share News

సోలార్‌ ఫెన్సింగ్‌ కట్‌ చేసి.. గోడ దూకి తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు

ABN , Publish Date - Feb 03 , 2025 | 02:01 AM

తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం వద్దనున్న సీపీఆర్‌ విల్లా్‌సలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. రెండు విల్లాల్లో దాదాపు 780 గ్రాముల బంగారు నగలు, 1.650 కిలోల వెండి వస్తువులు, రూ 4.5 లక్షల నగదు అపహరించుకెళ్లారు. ఈ వివరాలను ఆదివారం తిరుపతి క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారం.. సీపీఆర్‌ విల్లా్‌సలోని 81వ నెంబరు ఎలక్ర్టానిక్‌ సంస్థలకు సలహాదారుగా పనిచేస్తున్న మేఘనాదన్‌ నివాసం ఉంటున్నారు. బంధువుల పెళ్లి ఉండటంతో బ్యాంకు లాకర్‌ నుంచి బంగారు నగలు, వెండి వస్తువులను శనివారం తీసుకొచ్చారు. మేఘనాదన్‌ దంపతులు మొదటి అంతస్తులో.. అతని అత్త, కుమారుడు రెండో అంతస్తులో పడుకున్నారు. లాకర్‌ నుంచి నగలు తెచ్చిన విషయాన్ని గమనించిన దుండగులు చోరీకి ప్లాన్‌ చేశారు. శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఐదారు మంది విల్లా వెనుక ఖాళీ స్థలం నుంచి ప్రహరీ సోలార్‌ ఫెన్సింగ్‌ కట్‌ చేశారు.

సోలార్‌ ఫెన్సింగ్‌ కట్‌ చేసి.. గోడ దూకి  తిరుపతిలో రెచ్చిపోయిన దొంగలు

  • ఎస్పీ హర్షవర్ధనరాజు

- రెండు విల్లాల్లో 720 గ్రాముల బంగారం, రూ.4.50 లక్షల నగదు,

1.650 కిలోల వెండి అపహరణ

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం వద్దనున్న సీపీఆర్‌ విల్లా్‌సలో శనివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. రెండు విల్లాల్లో దాదాపు 780 గ్రాముల బంగారు నగలు, 1.650 కిలోల వెండి వస్తువులు, రూ 4.5 లక్షల నగదు అపహరించుకెళ్లారు. ఈ వివరాలను ఆదివారం తిరుపతి క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు మీడియాకు వెల్లడించారు. ఆ ప్రకారం.. సీపీఆర్‌ విల్లా్‌సలోని 81వ నెంబరు ఎలక్ర్టానిక్‌ సంస్థలకు సలహాదారుగా పనిచేస్తున్న మేఘనాదన్‌ నివాసం ఉంటున్నారు. బంధువుల పెళ్లి ఉండటంతో బ్యాంకు లాకర్‌ నుంచి బంగారు నగలు, వెండి వస్తువులను శనివారం తీసుకొచ్చారు. మేఘనాదన్‌ దంపతులు మొదటి అంతస్తులో.. అతని అత్త, కుమారుడు రెండో అంతస్తులో పడుకున్నారు. లాకర్‌ నుంచి నగలు తెచ్చిన విషయాన్ని గమనించిన దుండగులు చోరీకి ప్లాన్‌ చేశారు. శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు ఐదారు మంది విల్లా వెనుక ఖాళీ స్థలం నుంచి ప్రహరీ సోలార్‌ ఫెన్సింగ్‌ కట్‌ చేశారు. మట్టి డంప్‌పైకి ఎక్కి గోడ దూకి లోపలకు వెళ్లారు. మొదట ఇద్దరు 81వ నెంబరు విల్లా వెనుక వైపున్న అల్యూమినియం డోర్‌ లాక్‌ను కట్‌ చేశారు. బెడ్‌రూములో భద్రపరచిన 735 ్ఠ్ఠగ్రాముల బంగారు నగలు, 1.650 కిలోల వెండి వస్తువులు, 800 యూఎస్‌ డాలర్లు, రూ.4.50 లక్షల నగదు అపహరించారు. ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేశారు. ముందుగానే హాలులో ఉన్న రెండు సీసీ కెమెరాలను పగలగొట్టారు. అయితే మేఘనాదన్‌ మొబైల్‌ నెంబరుకు నెట్‌ కనెక్టు అయి ఉండటంతో దొంగల ఫొటోలు అందులో నిక్షిప్తంగా పోలీసులకు కొంతవరకు ఆధారాలు దొరికాయి.

విల్లా నెంబరు 82లోనూ..

ఇక్కడి విల్లా్‌సలోని 82లో దొర ప్లాస్టిక్స్‌ అధినేత కేశవులు నాయుడు కుమారుడు జగదీష్‌ నివాసం ఉంటున్నారు. వీరి కుటుంబ సభ్యులు మొదటి అంతస్థులో పడుకుని ఉన్నారు. ఈ విల్లా వెనుక అల్యూమినియం డోర్‌లాక్‌ను స్ర్కూ డ్రైవర్‌తో పగులకొట్టి లోపలకు ప్రవేశించారు. బెడ్‌రూములో భద్రపరచిన 45 గ్రాముల బంగారు నగలు, నాలుగు డైమండ్‌ లాకెట్లు, బ్లాక్‌ బీట్‌లు మూడు, చెవికమ్మలు ఒక జత అపహరించారు. ఇదే విల్లా నుంచి రెండు బ్యాగుల్లో వున్న మూడు కిలోల వెండి వస్తువులను ప్రహరీ బయట పడేసి వెళ్లారు. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకుని జగదీ్‌షకు అప్పగించారు. అలాగే, వ్యాపారవేత్త శ్రీనివాసరావు, కాశీవిశ్వనాథ్‌కు చెందిన 78, 80 విల్లాల్లోనూ చోరీకి యత్నించారు. ఇక్కడ, కిటికీ స్లైడింగ్‌ తీసి సీసీ కెమెరాలు పక్కకు నెట్టి లోపలకు వెళ్లారు. కానీ, ఎటువంటి చోరీ జరగలేదు.. రెండు విల్లాల్లో చోరీపై బాధితులు తిరుపతి క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసుల పరిశీలన

తిరుపతి క్రైం, శాంతిభద్రతల ఏఎస్పీలు నాగభూషణరావు, రవిమనోహరాచ్చారి, డీఎస్పీలు శ్యాంసుందర్‌, నరసింగప్ప, సీఐలు చిన్నగోవిందు, శివకుమార్‌ రెడ్డి, తిరుచానూరు ఎస్‌ఐలు అరుణ, జగన్నాధ రెడ్డి, సాయినాధ చౌదరి, క్లూస్‌ టీమ్‌, ఫింగర్‌ ప్రింట్‌ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వేలిముద్రలు, దొంగలు ఎర్రమట్టి తొక్కి వచ్చిన పాద ముద్రలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఐదారు మంది ఈ చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. ప్రతి ఇంట్లోకి ఇద్దరేసి వెళ్ళినట్లు పోలీసులు చెబుతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎస్పీ హర్షవర్ధనరాజు ఘటనా స్థలానికి చేరుకుని చోరీలు ఎలా జరిగాయని ఆరా తీసారు. దొంగల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 03 , 2025 | 02:01 AM