Share News

రుయాకు సీఎ్‌సఆర్‌ అనుమతి

ABN , Publish Date - Feb 26 , 2025 | 02:49 AM

రుయాస్పత్రికి వితరణ అందించే దాతలకు పన్ను మినహాయింపు అనుమతులు లభించినట్లు సూపరింటెండెంట్‌ రవిప్రభు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

రుయాకు సీఎ్‌సఆర్‌ అనుమతి

తిరుపతి(వైద్యం), ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): రుయాస్పత్రికి వితరణ అందించే దాతలకు పన్ను మినహాయింపు అనుమతులు లభించినట్లు సూపరింటెండెంట్‌ రవిప్రభు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దాతలకు పన్ను మినహాయింపు ఇచ్చేందుకు సీఎ్‌సఆర్‌-1(కార్పోరేషన్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) సర్టిఫికెట్‌ కోసం ఎన్నాళ్లగానో శ్రమించామని పేర్కొన్నారు. చివరకు మినిస్ర్టీ ఆఫ్‌ కార్పొరేషన్‌ ఎఫైర్స్‌ నుంచి సీఎ్‌సఆర్‌-1 అనుమతి పొందామని తెలిపారు. ఇకపై రుయాస్పత్రికి ఆర్థిక సాయం అందించే పరిశ్రమల నిర్వాహకులకు పన్ను మినహాయింపు ఉంటుందన్నారు.

Updated Date - Feb 26 , 2025 | 02:49 AM