కిక్కిరిసిన అలిపిరి
ABN , Publish Date - Feb 24 , 2025 | 01:48 AM
తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి తనిఖీ కేంద్రం ఆదివారం వాహనాలతో కిక్కిరిసింది. తిరుమలలో భక్తుల క్యూలైన్ బయటకు వ్యాపించకపోయినా, అలిపిరిలో మాత్రం వాహనాలు క్యూకట్టాయి. ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది.

తిరుమలకు ముఖద్వారమైన అలిపిరి తనిఖీ కేంద్రం ఆదివారం వాహనాలతో కిక్కిరిసింది. తిరుమలలో భక్తుల క్యూలైన్ బయటకు వ్యాపించకపోయినా, అలిపిరిలో మాత్రం వాహనాలు క్యూకట్టాయి. ఇటీవల సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. దీంతో రద్దీ మోస్తరుగానే ఉన్నప్పటికీ అలిపిరి తనిఖీ కేంద్రంలో మాత్రం వాహనాలు బారులు తీరుతున్నాయి.
- తిరుమల, ఆంధ్రజ్యోతి