CM Chandrababu: రప్పా రప్పా అంటే వదలి పెట్టను.. జగన్ అండ్ కోకు సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Dec 26 , 2025 | 04:43 PM
వైసీపీ హయాంలో మళ్లీ రౌడీయిజం పెరిగిందని... అదే సరైనదని ఇంకా ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారని సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. రప్పా రప్పా అని పోస్టర్లు వేసి బెదిరిస్తున్నారని హెచ్చరించారు.
తిరుపతి, డిసెంబరు26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవాళ (శుక్రవారం) తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు.
వైసీపీ హయాంలో మళ్లీ రౌడీయిజం పెరిగిందని... అదే సరైనదని ఇంకా ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారని ఫైర్ అయ్యారు. రప్పా రప్పా అని పోస్టర్లు వేసి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. జంతువులను బలి ఇచ్చి, ఆ రక్తంతో పోస్టర్‌పై రక్తాభిషేకం చేయడం చూశానని మండిపడ్డారు. జగన్ అండ్ కో ఇష్టారాజ్యంగా చేస్తే, ఎవరినీ వదలిపెట్టనని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.