Share News

బాలలూ... ఇస్రో పిలుస్తోంది

ABN , Publish Date - Feb 22 , 2025 | 01:40 AM

విద్యార్థుల్లో సృజనాత్మకత, మేథస్సును వెలికితీసి, ప్రత్యేక శిక్షణనిచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. దీనికోసం యువ విజ్ఞాని కార్యక్రమం (యువికా) పేరిట 2025 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

బాలలూ... ఇస్రో పిలుస్తోంది

ఇస్రో యువికా 2025 దరఖాస్తుల ఆహ్వానం

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో సృజనాత్మకత, మేథస్సును వెలికితీసి, ప్రత్యేక శిక్షణనిచ్చి యువ శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. దీనికోసం యువ విజ్ఞాని కార్యక్రమం (యువికా) పేరిట 2025 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 24 నుంచి మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్స్‌లో తెలిపింది. ‘క్యాచ్‌ దెమ్‌ యంగ్‌’ పేరిట రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో అంతరిక్ష, సాంకేతికత, విజ్ఞానం, ఆప్లికేషన్లపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. విద్యార్థి దశలోనే విజ్ఞానం, సాంకేతికత, ఇంజినీరింగ్‌, మ్యాఽథమేటిక్స్‌ (స్టెమ్‌) అంశాలపై అవగాహన కల్పించి తద్వారా వారిని అంతరిక్ష పరిశోధనల వైపు దృష్టి మళ్లించడమే దీని లక్ష్యం.

Updated Date - Feb 22 , 2025 | 01:41 AM