వేద వర్సిటీలో చిరుత!
ABN , Publish Date - Feb 03 , 2025 | 02:07 AM
తిరుపతిలోని ఎస్వీ వేద యూనివర్సిటీలో చిరుత సంచారం విద్యార్థులను కలవర పెడుతోంది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రామేశ్వరం భవన్‌కు ఎదురుగా గల చెట్ల పొదల్లో చిరుత కనిపించింది. అటువైపుగా వెళుతున్న వర్సిటీ ఉద్యోగి ఒకరు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందికి ఆయన సమాచారాన్ని చేరవేశారు. వారు సెక్యూరిటీ వాహనంలో సైరన్ మోగించినా చిరుత కదలకపోవడం గమనార్హం. వేద వర్సిటీలో ఏదో ఒక చోట చిరుత సంచరిస్తుండటం విద్యార్థులు, ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ వేద యూనివర్సిటీలో చిరుత సంచారం విద్యార్థులను కలవర పెడుతోంది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో రామేశ్వరం భవన్‌కు ఎదురుగా గల చెట్ల పొదల్లో చిరుత కనిపించింది. అటువైపుగా వెళుతున్న వర్సిటీ ఉద్యోగి ఒకరు తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందికి ఆయన సమాచారాన్ని చేరవేశారు. వారు సెక్యూరిటీ వాహనంలో సైరన్ మోగించినా చిరుత కదలకపోవడం గమనార్హం. వేద వర్సిటీలో ఏదో ఒక చోట చిరుత సంచరిస్తుండటం విద్యార్థులు, ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.