చెర్లోపల్లె సర్పంచికి కేంద్ర పురస్కారం
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:47 AM
తిరుపతిరూరల్ మండలం చెర్లోపల్లె సర్పంచి బి.సుభాషిణికి జాతీయస్థాయి శక్త్ పంచాయత్ నేత్రి అభియాన్ పురస్కారం లభించింది. రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామ పంచాయతీలు, మండలాలను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న మహిళలను జిల్లా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా చెర్లోపల్లె పంచాయతీలో పలు అభివృద్ధి పనుల (సీసీరోడ్లు, యూడీఎ్‌స)తో పాటు అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినందుకు పురస్కారం లభించింది. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన జాతీయ మహిళాదినోత్సవ సదస్సులో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖామంత్రి రాజీవ్‌రాజన్ సింగ్ చేతులమీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. రూరల్‌మండలంలో మహిళా సర్పంచ్‌ల కేటగిరీల్లో ఈమెని ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సర్పంచి సుభాషిణికి సీపీఐ రాష్ట్ర కార్యావర్గ సభ్యుడు ఎ. రామానాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు.

తిరుపతి (రూరల్/ఆటోనగర్), మార్చి4(ఆంధ్రజ్యోతి): తిరుపతిరూరల్ మండలం చెర్లోపల్లె సర్పంచి బి.సుభాషిణికి జాతీయస్థాయి శక్త్ పంచాయత్ నేత్రి అభియాన్ పురస్కారం లభించింది. రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహిస్తూ గ్రామ పంచాయతీలు, మండలాలను అభివృద్ధిపథంలో నడిపిస్తున్న మహిళలను జిల్లా పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవ సదస్సుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా చెర్లోపల్లె పంచాయతీలో పలు అభివృద్ధి పనుల (సీసీరోడ్లు, యూడీఎ్‌స)తో పాటు అదనపు ఆదాయాన్ని సమకూర్చేలా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసినందుకు పురస్కారం లభించింది. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన జాతీయ మహిళాదినోత్సవ సదస్సులో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖామంత్రి రాజీవ్‌రాజన్ సింగ్ చేతులమీదుగా ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. రూరల్‌మండలంలో మహిళా సర్పంచ్‌ల కేటగిరీల్లో ఈమెని ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న సర్పంచి సుభాషిణికి సీపీఐ రాష్ట్ర కార్యావర్గ సభ్యుడు ఎ. రామానాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలిపారు.