Share News

జూన్‌ నాటికి చిత్తూరు- తచ్చూరు హైవే పూర్తి

ABN , Publish Date - Jan 27 , 2025 | 01:38 AM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా ప్రగతిపథంలో పరుగులు తీస్తోందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. చిత్తూరులోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం 76వ గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి గురించి మాట్లాడుతూ రూ.3,800 కోట్లతో జరుగుతున్న చిత్తూరు- తచ్చూరు హైవే ఈ ఏడాది జూన్‌ నుంచి అందుబాటులోకి రానుందని, రూ.5వేల కోట్లతో నిర్మాణంలో ఉన్న చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి కానుందని తెలిపారు.

జూన్‌ నాటికి చిత్తూరు- తచ్చూరు  హైవే పూర్తి
గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

రూ.110 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం

రూ.50 కోట్లతో 2108 గోకులం షెడ్లు

చిత్తూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జిల్లా ప్రగతిపథంలో పరుగులు తీస్తోందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు. చిత్తూరులోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం 76వ గణతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి గురించి మాట్లాడుతూ రూ.3,800 కోట్లతో జరుగుతున్న చిత్తూరు- తచ్చూరు హైవే ఈ ఏడాది జూన్‌ నుంచి అందుబాటులోకి రానుందని, రూ.5వేల కోట్లతో నిర్మాణంలో ఉన్న చెన్నై- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ హైవే వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి కానుందని తెలిపారు. దీపం-2 పథకం కింద జిల్లాలో 3,17,158 కుటుంబాలు సబ్సిడీ రూపంలో రూ.25.58 కోట్ల లబ్ధి పొందాయన్నారు. పల్లె పండుగ కార్యక్రమంలో 1,609 సీసీ రోడ్లను రూ.110 కోట్లతో ప్రారంభించగా 1,150 పనులు పూర్తయ్యాయన్నారు. రూ.50 కోట్లతో 2,108 గోకులం షెడ్లు మంజూరవగా.. సగానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు.అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలందించిన 310మంది అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్‌ ప్రశంసా పత్రాలను అందించారు.స్వాతంత్య్ర సమరయోధుడు, పలమనేరు మాజీ ఎమ్మెల్యే 105 సంవత్సరాల సీఆర్‌ రాజన్‌ను సన్మానించారు. ఇటీవల ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమానుపెంటకు చెందిన కార్తీక్‌ తల్లిదండ్రులను సన్మానించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వ్యవసాయ భూమిని ఇస్తున్నట్లు కలెక్టర్‌ ప్రకటించారు.3వ తరగతి విద్యార్థిని అమీనా గణతంత్ర దినోత్సవంపై రెండు నిమిషాలపాటు ఇంగ్లీ్‌షలో చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. జిల్లా జడ్జి భీమారావు, జూనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనివాసరావు,మేయర్‌ అముద,ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్‌, జేసీ విద్యాధరి, డీఎ్‌ఫవో భరణి, ఏఎస్పీ రాజశేఖర రాజు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హిమవంశీ, డీఆర్వో మోహన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 01:38 AM