‘పుట్టి’ ముంచిన దళారులు!
ABN , Publish Date - Feb 10 , 2025 | 12:50 AM
వరిపంట కోతలు మొదలయ్యాయి. రైతులు ధాన్యాన్ని అమ్మి అప్పులు తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ముఖ్యంగా పెద్ద జిలకర్ల ధర భారీగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డెల్టా ప్రాంతంలో స్వర్ణముఖి నది పరివాహక గ్రామాల్లో రైతులు ఫిల్టర్ పాయింట్ల కింద వరి సాగుచేశారు. గతేడాది పుట్టి 5204 (పెద్ద జిలకర్లు) రూ.24,500 పలికాయి. దీంతో ఈ ఏడాది కొన్ని గ్రామాల రైతులు బీపీటీ 5204 (పెద్ద జిలకర్లు) రకాన్ని అత్యధికంగా సాగుచేశారు. ఆ రకం ధాన్యం ధర రూ.18,500కు దిగజారింది. ఆ తర్వాత రూ.18,100కు పడిపోయింది. ఆ ధాన్యాన్ని అడిగే దళారులు, మిల్లర్లు లేకపోవడంతో రైతులు దిగాలు పడిపోయారు. ఇలా ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

-వరి చేతికొచ్చేసరికి ధరల పతనం
- కానరాని కొనుగోలు కేంద్రాలు

దళారుల దోపిడీ
షుగర్‌లెస్ ధాన్యం ఈ ఏడాది మొదట్లో పుట్టి రూ.18,500 పలికి ప్రస్తుతం 19,500 రూపాయల వరకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు దళారులు ప్రచారం చేస్తున్నారు. ఈయితే, ఈ రకాన్ని రైతులు అతి తక్కువగా సాగు చేశారు.
ఫ అదే కేఎన్‌ఎంలు (సన్నాలు) రకం పుట్టి రూ.19,500 పలికి ప్రస్తుతం రూ.18,700 నుంచి రూ.19వేల వరకు వచ్చి ఆగిపోయి ఉంది. ఈ ధాన్యాన్ని రైతులు ఎక్కువగా సాగుచేశారు. అయితే, దళారులు, ఇతర రాష్ట్రాల్లోని మిల్లర్లు కుమ్మక్కయ్యారు. కర్ణాటకలోని కుమ్మకూరు, తమిళనాడులోని రెడ్‌హిల్స్‌లో ఈ ధాన్యం పెద్దగా డిమాండ్ లేదని దళారులు ప్రచారం చేస్తున్నారు. రైతులు తక్కువగా పండించిన ధాన్యానికి డిమాండ్ పెంచేసి ఎక్కువ సాగుచేసే ధాన్యానికి డిమాండ్ పడిపోయిందని రైతులను దోపిడీకి గురిచేస్తున్నారన్న ఆరోపణలున్ననయి. గతేడాదితో పోల్చుకుంటే బీపీటీ 5204, కేఎన్‌ఎం రకాలు ఈ ఏడాది ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
కొనుగోలు కేంద్రాలేవీ
ఏటా ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేవి. రైతులు ధాన్యాన్ని అరబెట్టుకొని గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని అమ్ముకుంటూ వచ్చేవారు. మండలంలోని 21 పంచాయతీలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎక్కడా లేవు. దీంతో పండించిన ధాన్యానికి దళారులు నెమ్ములు, పచ్చిపేరుతో నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ ఏడాది దిగుబడి వచ్చినా ఆశించినంతమేర ధరలు లేకపోవడంతో రైతులు డీలాపడ్డారు.
- కోట, ఆంధ్రజ్యోతి