Share News

రక్తమోడిన రహదారి

ABN , Publish Date - Feb 03 , 2025 | 02:22 AM

నగరి పట్టణం సాయిబాబా గుడి సమీపంలోని తిరుపతి- చెన్నై జాతీయ రహదారి ఆదివారం రాత్రి 9 గంటలకు రక్తమోడింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బస్సుకు ఒకపక్క సగభాగం వరకు ధ్వంసమైంది. గాయపడ్డ ప్రయాణికుల హాహాకారాలతోపాటు రోడ్డంతా రక్తసిక్తమైంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కొంతసేపు నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత తేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను స్థానికులు, పోలీసులు, 108 వాహన సిబ్బంది కలిసి నగరి ఏరియా వైద్యశాలకు తరలించారు. డ్యూటీలోని సిబ్బంది కాకుండా వైద్యులు, ఇతర సిబ్బంది హుటాహుటిన వచ్చి బాధితులకు చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రి రోదనలతో నిండిపోయింది. నగరి డీఎస్పీ అజీజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

రక్తమోడిన రహదారి
ఓవైపు సగభాగం దెబ్బతిన్న బస్సు

  • ఓవర్‌టేక్‌ చేస్తుండగా ప్రైవేటు బస్సును ఢీకొట్టిన లారీ

  • నలుగురి దుర్మరణం జూ 13 మందికి తీవ్రగాయాలు

  • ఒకరి పరిస్థితి విషమం

  • రాత్రి 9 గంటలకు ప్రమాదం

నగరి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): నగరి పట్టణం సాయిబాబా గుడి సమీపంలోని తిరుపతి- చెన్నై జాతీయ రహదారి ఆదివారం రాత్రి 9 గంటలకు రక్తమోడింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో బస్సుకు ఒకపక్క సగభాగం వరకు ధ్వంసమైంది. గాయపడ్డ ప్రయాణికుల హాహాకారాలతోపాటు రోడ్డంతా రక్తసిక్తమైంది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు కొంతసేపు నిశ్చేష్టులయ్యారు. ఆ తర్వాత తేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బాధితులను స్థానికులు, పోలీసులు, 108 వాహన సిబ్బంది కలిసి నగరి ఏరియా వైద్యశాలకు తరలించారు. డ్యూటీలోని సిబ్బంది కాకుండా వైద్యులు, ఇతర సిబ్బంది హుటాహుటిన వచ్చి బాధితులకు చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రి రోదనలతో నిండిపోయింది. నగరి డీఎస్పీ అజీజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులు: తిరుత్తణికి చెందిన కుమార్‌(60), తిరువళ్లూరుకు చెందిన ధనుష్కోటి(12), వడమాలపేట మండలంలోని సీతారామాపురానికి చెందిన పార్థసారథి నాయుడు (62), రాజేంద్రనాయుడు (60).

గాయపడినవారు:రాధాకృష్ణ(తాడిపత్రి),సెల్వి(తిరుపతి),వెట్రివేల్‌(తిరువళ్లూరు),భరత్‌ (తిరుపతి), మురళి (ఊత్తుకోట), రుద్రమూర్తి (తిరువళ్లూరు),సుబ్బరత్నమ్మ (తాడిపత్రి), సుధాకర్‌(తిరువళ్లూరు), చిన్నామలై(తిరువళ్లూరు),నాగేంద్ర(తాడిపత్రి), ఆయన తల్లి,అనూరాధ దంపతులు ఽ(శివగిరి). పరిస్థితి విషమంగా ఉన్న చిన్నామలైని తిరుపతికి తరలించారు.

Updated Date - Feb 03 , 2025 | 02:22 AM