Share News

Bar: ముగిసిన బార్ల లాటరీ ప్రక్రియ

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:28 AM

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు లాటరీ ప్రక్రియను పూర్తిచేశారు.

Bar: ముగిసిన బార్ల లాటరీ ప్రక్రియ
లాటరీ తీస్తున్న డీఆర్వో మోహన్‌ కుమార్‌

చిత్తూరు సిటీ, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న బార్లకు లాటరీ ప్రక్రియను పూర్తిచేశారు. ప్రభుత్వం జిల్లాలో 11 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇందులో చిత్తూరులో రెండు బార్లకు, గీత కులాలవారికి కేటాయించిన ఓ బార్‌కు, కుప్పం, పుంగనూరులో ఒక్కో బార్‌కు నాలుగు చొప్పున 20 దరఖాస్తులు వచ్చాయి. వీటిద్వారా ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం వచ్చింది. ఈ బార్లను శనివారం కల్టెరేట్‌లోని డీఆర్‌డీఏ మీటింగ్‌ హాల్‌లో డీఆర్వో మోహన్‌ కుమార్‌ లాటరీ ద్వారా దరఖాస్తుదారులకు కేటాయించారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ డీసీ విజయ్‌ శేఖర్‌, ఈఎస్‌ శ్రీనివాస్‌, సీఐలు శ్రీహరి రెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:28 AM