Share News

లారీ ఢీకొని ఏఆర్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం

ABN , Publish Date - Feb 24 , 2025 | 02:05 AM

నాయుడుపేట మండలం పుదూరు సమీపంలో మోటారుసైకిల్‌ను లారీ ఢీకొనడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌ (39) దుర్మరణం చెందారు.

లారీ ఢీకొని ఏఆర్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం
భాస్కర్‌ (ఫైల్‌ఫొటో)

నాయుడుపేట టౌన్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): నాయుడుపేట మండలం పుదూరు సమీపంలో మోటారుసైకిల్‌ను లారీ ఢీకొనడంతో ఏఆర్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌ (39) దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు... నాయుడుపేట పోలీసు స్టేషన్‌లో ఏఆర్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న భాస్కర్‌.. చిట్టమూరు మండలం ఈశ్వరవాకలో నివాసం ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం విధులకు హాజరయ్యేందుకు మోటారు సైకిల్‌పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆయన మృతి చెందారు. నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, అర్బన్‌ సీఐ బాబి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. భాస్కర్‌ మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 24 , 2025 | 02:05 AM