బ్యాంకుల్లో తగిన నియామకాలు చేపట్టాలి
ABN , Publish Date - Mar 08 , 2025 | 01:56 AM
బ్యాంకుల్లో తగిన నియామకాలు చేపట్టి.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎ్‌ఫబీయూ) నాయకులు డిమాండ్ చేశారు.
యూఎ్‌ఫబీయూ నాయకుల డిమాండ్
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): బ్యాంకుల్లో తగిన నియామకాలు చేపట్టి.. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎ్‌ఫబీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం చిత్తూరులోని కొంగారెడ్డిపల్లెలో ఉన్న ఇండియన్ బ్యాంకు బ్రాంచ్ ఎదుట వివిధ బ్యాంకుల ఉద్యోగులతో కలిసి ధర్నా నిర్వహించారు. వారంలో ఐదురోజుల బ్యాంకింగ్ అమలు, ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్ నిలుపుదల, తదితర సమస్యలను పరిష్కరించాలని చిత్తూరు జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ అధ్యక్షుడు టి.శేఖర్, కార్యదర్శి పి.విజయ్‌భాస్కర్ కోరారు. లేదంటే ఈనెల 24, 25 తేదీల్లో యూఎ్‌ఫబీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్త బ్యాంకింగ్ సమ్మె చేపడతామని హెచ్చరించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉద్యోగులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ నాయకులు విజయభాస్కర్, గంగిరెడ్డి, యోగేష్, ఆర్.అనిల్‌కుమార్, ఏకే శ్రీహరి, మునిరెడ్డి, సెల్వం, విఘ్నేష్, ప్రభుత్వ, సహకార, గ్రామీణ బ్యాంకుల ఉద్యోగులు పాల్గొన్నారు.