పద్మావతి వర్సిటీ దూర విద్యకు దరఖాస్తు చేసుకోండి
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:21 AM
పద్మావతి మహిళా యూనివర్సిటీలోని దూరవిద్యా కేంద్రం నిర్వహించే పలు కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జనవరి 29 (ఆంధ్రజ్యోతి): పద్మావతి మహిళా యూనివర్సిటీలోని దూరవిద్యా కేంద్రం నిర్వహించే పలు కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఎంఏ సంగీతం, తెలుగు, ఎంకాం, మ్యూజిక్‌లో డిప్లొమో వంటి కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 31 నుంచీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఫిబ్రవరి 5వ తేదీ చివరి గడువు. ఫిబ్రవరి 7 నుంచీ 12 వ తేదీ దాకా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సమగ్ర సమాచారం కోసం.. ఎస్‌పీఎంవీవీ.. వెబ్‌సైట్ కానీ, 0877-2284524 లేదా 8121787415 నెంబర్లలో సంప్రదించాలని వర్సిటీ పీఆర్వో డాక్టర్ శ్రీరజని తెలిపారు.