వ్యవసాయ కళాశాలకు మళ్లీ బాంబు బెదిరింపు
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:30 AM
తిరుపతి వ్యవసాయ కళాశాలకు మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. స్వాతి బిలాల్ మాలిక్ పేరిట మెయిల్ నుంచి గురువారం రావడంతో ప్రిన్సిపాల్ రమణ డయల్ 100కు సమాచారం ఇచ్చారు.

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): తిరుపతి వ్యవసాయ కళాశాలకు మళ్లీ బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. స్వాతి బిలాల్ మాలిక్ పేరిట మెయిల్ నుంచి గురువారం రావడంతో ప్రిన్సిపాల్ రమణ డయల్ 100కు సమాచారం ఇచ్చారు. తిరుపతి రూరల్ పోలీసులు, డాగ్.. బాంబు డిస్పోజ్ స్క్వాడ్లు కళాశాలకు చేరుకుని ప్రిన్సిపల్ చాంబర్, తరగతి గదులు, హాస్టళ్లు, పరిసరాల్లోనూ రెండు గంటలకుపైగా అణువణువు తనిఖీ చేశారు. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులూ లేకపోవడంతో మెయిల్ ఉత్తుత్తిదేనని తేల్చారు. గతంలోనూ ఇదే తరహాలో బెదిరింపు మెయిల్ వచ్చింది. కాగా, ఇప్పుడు వచ్చిన మెయిల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. సంబంఽధిత వ్యక్తులను గుర్తించే ప్రక్రియ వేగవంతం చేశామని తిరుపతి రూరల్ సీఐ చిన్నగోవిందు తెలిపారు.