Share News

గృహ నిర్మాణాల్లో 2.0కు విశేష స్పందన

ABN , Publish Date - Jan 24 , 2025 | 01:45 AM

‘గృహ నిర్మాణ శాఖలో సొంతింటి సాకారం కోసం పీఎం ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన 2.0 వర్షన్‌కు విశేష స్పందన లభిస్తోంది.

గృహ నిర్మాణాల్లో 2.0కు విశేష స్పందన
గోపాల్‌ నాయక్‌

- హౌసింగ్‌ ఇన్‌చార్జి పీడీ గోపాల్‌ నాయక్‌

చిత్తూరు సెంట్రల్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): ‘గృహ నిర్మాణ శాఖలో సొంతింటి సాకారం కోసం పీఎం ఆవాస్‌ యోజన (పీఎంఏవై) కింద కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకు వచ్చిన 2.0 వర్షన్‌కు విశేష స్పందన లభిస్తోంది. నిరుపేదలైనవారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గృహాలు పొందేందుకు ప్రభుత్వం చర్యలు సులభతరం చేసింది’ అని హౌసింగ్‌ ఇన్‌చార్జి ప్రాజెక్టు డైరెక్టర్‌ గోపాల్‌ నాయక్‌ తెలిపారు. ఆయనతో ఫటాఫట్‌ ఇంటర్వ్యూ.

? సొంతింటి కల నిజం కావాలంటే ఏం చేయాలి

! పేదవాడి సొంతింటి కల నిజం చేయడానికి పీఎంఏవై - ఎన్టీఆర్‌ నగర్‌ కొత్త విధానాన్ని రూపొందించింది. దీన్నే 2.0గా పిలుస్తారు. దీని ద్వారా లబ్ధిదారుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయోజనం పొందవచ్చు.

? 2.0 అంటే ఏమిటి

! పీఎంఏవై-ఎన్టీఆర్‌ నగర్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖలో 2.0 వెర్షన్‌ ప్రవేశపెట్టింది. కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగకుండా ఒక క్లిక్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సౌలభ్యం ఉంది.

? ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి

! సాంకేతిక పరిజ్ఞానం కలిగిన లబ్ధిదారుడు ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే నెట్‌ సెంటర్‌, మీ-సేవతోపాటు సచివాలయంలోని రూరల్‌ హౌసింగ్‌ ఇంజనీర్‌ అసిస్టెంట్ల సహకారంతో దరఖాస్తు చేసుకోవచ్చు.

? ఎలాంటి స్పందన ఉంది.

! ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి 13,696, పట్టణ ప్రాంతాల నుంచి 2049, మొత్తంగా 15,745 దరఖాస్తులు వచ్చాయి.

Updated Date - Jan 24 , 2025 | 01:45 AM