Share News

పొలాలపై ఏనుగుల గుంపు దాడి

ABN , Publish Date - Feb 15 , 2025 | 02:11 AM

పొలాలపై ఏనుగుల గుంపు గురువారం అర్ధరాత్రి దాడి చేసింది. దీంతో వరి, మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. బంగారుపాళ్యం మండలంలోని ఎగువ కంతల చెరువు గ్రామ సమీపంలో ఉన్న పొలాలపై ఏనుగుల గుంపు పడింది.

పొలాలపై ఏనుగుల గుంపు దాడి
తొక్కేసిన వరిపంట

- వరి, మామిడి, అరటి పంటలకు నష్టం

బంగారుపాళ్యం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): పొలాలపై ఏనుగుల గుంపు గురువారం అర్ధరాత్రి దాడి చేసింది. దీంతో వరి, మామిడి, అరటి పంటలకు నష్టం వాటిల్లింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. బంగారుపాళ్యం మండలంలోని ఎగువ కంతల చెరువు గ్రామ సమీపంలో ఉన్న పొలాలపై ఏనుగుల గుంపు పడింది. గ్రామానికి చెందిన భాస్కర్‌ పొలంలో నీటి పైపులైన్లను ధ్వంసం చేశాయి. మునికృష్ణ, వెంకటే్‌షలకు చెందిన వరి పంటను తొక్కేశాయి. ఈశ్వరయ్య, ప్రకాష్‌, దేవేంద్ర, రాధలకు చెందిన మామిడి చెట్లను, కుమారస్వామికి చెందిన అరటి చెట్లను విరిచేశాయి. ఏనుగుల దాడులతో తీవ్రంగా నష్టపోయామని, పొలాలకు వెళ్లాలన్నా భయంగా ఉందని బాధిత రైతులు చెబుతున్నారు. అధికారులు తమకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుతున్నారు.

Updated Date - Feb 15 , 2025 | 02:11 AM