తల్లి ఒడి చేరిన చిన్నారి
ABN , Publish Date - Mar 05 , 2025 | 01:45 AM
తిరుమలలో కనిపించకుండాపోయిన బాలిక క్షేమంగా తల్లి ఒడికి చేరింది. తిరుమలలో చిరువ్యాపారులుగా ఉన్న విజయవాడకు చెందిన కరుణశ్రీ, నరసింహులు కూతురు నాలుగేళ్ల దీక్షిత ఆస్థానమండపం వద్ద ఆడుకుంటుండగా సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. వీరు రాత్రి 7.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి ఒక మహిళ వెంట పాప తిరుపతికి వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. ఆ మహిళ ధరించిన దుస్తులు ఆధారంగా తిరుమలలోనే పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలుగా గుర్తించారు. వెంటనే తిరుపతిలోని పోలీసులను అప్రమత్తం చేసి బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లో రాత్రి 10.30 గంటల సమయంలో చిన్నారితో సహా మహిళను అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి 12.30 గంటలకు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పాప ఆచూకీ కనిపెట్టిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించారు.

తిరుమల, మార్చి4 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో కనిపించకుండాపోయిన బాలిక క్షేమంగా తల్లి ఒడికి చేరింది. తిరుమలలో చిరువ్యాపారులుగా ఉన్న విజయవాడకు చెందిన కరుణశ్రీ, నరసింహులు కూతురు నాలుగేళ్ల దీక్షిత ఆస్థానమండపం వద్ద ఆడుకుంటుండగా సోమవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. వీరు రాత్రి 7.30 గంటల సమయంలో పోలీసులను ఆశ్రయించారు. కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించి ఒక మహిళ వెంట పాప తిరుపతికి వెళ్లినట్టు నిర్ధారించుకున్నారు. ఆ మహిళ ధరించిన దుస్తులు ఆధారంగా తిరుమలలోనే పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలుగా గుర్తించారు. వెంటనే తిరుపతిలోని పోలీసులను అప్రమత్తం చేసి బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతి పెద్దకాపు లేఅవుట్‌లో రాత్రి 10.30 గంటల సమయంలో చిన్నారితో సహా మహిళను అదుపులోకి తీసుకున్నారు. అర్థరాత్రి 12.30 గంటలకు పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పాప ఆచూకీ కనిపెట్టిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించారు.