వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - Feb 24 , 2025 | 02:12 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధుడి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచే స్వామి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు ఆలయం వెలుపలకు వ్యాపించాయి.
- భక్తులతో కిక్కిరిసిన కాణిపాకం
ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధుడి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఉదయం నుంచే స్వామి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో క్యూలైన్లు ఆలయం వెలుపలకు వ్యాపించాయి. స్వామి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది. క్యూలైన్లలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పర్యవేక్షించారు.