జిల్లా ఇంఛార్జి మంత్రికి 18వ ర్యాంకు
ABN , Publish Date - Feb 07 , 2025 | 01:50 AM
జిల్లా ఇంఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పనితీరుపరంగా 18వ ర్యాంకు లభించింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ర్యాంకులను ప్రకటించారు.

చిత్తూరు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇంఛార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పనితీరుపరంగా 18వ ర్యాంకు లభించింది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ర్యాంకులను ప్రకటించారు. గతేడాది జూలై నుంచీ డిసెంబరు దాకా ఆరు నెలల పాటు ఫైళ్ళ పరిష్కారంలో మంత్రుల పనితీరు ఆధారంగా ర్యాంకులు నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.అందులో భాగంగా రవాణా, యువజన,క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డికి 18వ ర్యాంకు వచ్చింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచీ ఫైళ్ళ పరిష్కారాన్ని పరిగణనలోకి తీసుకుంటే ర్యాంకుల్లో తేడాలుండే అవకాశముంది. కాకపోతే దాని కోసం ఈ ఏడాది జూన్ ముగిసే దాకా వేచి చూడాల్సి వుంది.