Share News

Property Dispute: ఆస్తులు పంచుకున్నారు.. అమ్మను వదిలేశారు

ABN , Publish Date - Jul 26 , 2025 | 04:09 AM

ఆస్తులు పంచుకున్న బిడ్డలు, తల్లి సంరక్షణకు మాత్రం ముందుకు రాలేదు. కళ్లలో పెట్టుకుని చూడాల్సిన

Property Dispute: ఆస్తులు పంచుకున్నారు.. అమ్మను వదిలేశారు

  • కుమారుల నుంచి భృతి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించిన వృద్ధురాలు

పీసీపల్లి, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఆస్తులు పంచుకున్న బిడ్డలు, తల్లి సంరక్షణకు మాత్రం ముందుకు రాలేదు. కళ్లలో పెట్టుకుని చూడాల్సిన కన్నతల్లిని భారంగా భావించి నిర్దాక్షిణ్యంగా వదిలేశారు. విధిలేని పరిస్థితిలో 74 సంవత్సరాల వృద్ధురాలు కోర్టును ఆశ్రయించింది. వివరాలు.. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం కోదండరామపురం గ్రామానికి చెందిన గుర్రం నరసింహం, సుబ్బమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమారుడు చనిపోగా, ఏడాదిన్నర క్రితం నరసింహం మృతిచెందాడు. 9 ఎకరాల పొలం, ఇంటిని కుమారులు పంచుకున్నారు. అప్పటి నుంచి సుబ్బమ్మకు కష్టాలు మొదలయ్యాయి. తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తులను పంచుకున్న ఆ బిడ్డలు తల్లి బాగోగులు మాత్రం చూడటం లేదు. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ క్రమంలో తన జీవనం కోసం కుమారుల నుంచి భృతి ఇప్పించి న్యాయం చేయాలని ఇటీవల కనిగిరి కోర్టును ఆశ్రయించింది. ఈ నెల 22న చిన్న కొడుకు వాయిదాకు హాజరుకాగా, పెద్ద కొడుకు హాజరుకాలేదు. దీంతో న్యాయమూర్తి విచారణను వచ్చేనెల 20వ తేదీకి వాయిదా వేశారు.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 04:09 AM