MLA Pulivarthi: చంద్రగిరి చరిత్రను నాశనం చేసిన చెవిరెడ్డి
ABN , Publish Date - Aug 05 , 2025 | 05:37 AM
ఎంతో ఘనచరిత్ర కలిగిన చంద్రగిరి నియోజకవర్గాన్ని అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి
లిక్కర్ స్కామ్‌లో జగన్‌కంటే ఈయన పాత్రే కీలకం: ఎమ్మెల్యే పులివర్తి
తిరుపతి(వైద్యం), ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ‘ఎంతో ఘనచరిత్ర కలిగిన చంద్రగిరి నియోజకవర్గాన్ని అక్రమాలు, దోపిడీలు, అన్యాయాలతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నాశనం చేశాడు. రాష్ట్ర పరువునూ తీసేశాడు’ అని ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపించారు. తిరుపతి రూరల్ మండలంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మద్యం కుంభకోణంలో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి.. కోర్టు బయట అధికారులను బెదిరిస్తూ.. కోర్టు లోపల జడ్జిల వద్ద ఏడుస్తూ తన నటనతో ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నాడు. పూటకో మాట, రోజుకో బాట వేస్తూ తుమ్మలగుంట అపరిచితుడిలా చెవిరెడ్డి నటిస్తున్నాడు. వేల కోట్లు కొల్లగొట్టిన మద్యం కుంభకోణంలో మాజీ సీఎం జగన్‌కంటే చెవిరెడ్డి పాత్రే కీలకం. దీనికి సంబంధించిన సాక్ష్యాలన్నీ సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. మద్యం కుంభంకోణంలో జగన్, కేసీఆర్ సంపాదించిన అవినీతి సొమ్మును దుబాయ్ వంటి విదేశాలకు తరలించడంలో చెవిరెడ్డి ముఠా కీలకపాత్ర పోషించింది. లిక్కర్ స్కామ్‌లో సూత్రధారులందరూ చెవిరెడ్డి ప్రియశిష్యులు కాదా? అవినీతి, అక్రమాలకు చెవిరెడ్డికి సహకరించిన అధికారుల జాబితా మా వద్ద ఉంది. కీలకపాత్ర పోషించిన అధికారులకూ శిక్ష తప్పదు. అదేవిధంగా తుడాలో రూ.వందల కోట్ల అవీనితికి పాల్పడిన తండ్రీ కొడుకులు (చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి) శిక్ష అనుభవిస్తారు. టీటీడీ కల్తీ నెయ్యి విషయంలో కూడా చెవిరెడ్డిదే కీలక పాత్ర. ఎన్నికల ముందు నాతో పాటు నా కుటుంబ సభ్యుల ఫోన్లనూ చెవిరెడ్డి ట్యాప్ చేయించారు. తుమ్మలగుంట దేవాలయంలో చెరువులను చెరబట్టి పార్కులుగా మార్చి రూ.వేల కోట్లను దిగమింగిన విషయాలు బయటకు తీసి ఆయన నిజస్వరూపాన్ని సాక్ష్యాధారాలతో జనం ముందుకు తీసుకొస్తా’ అని నాని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News