Chevireddy : సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి రచ్చ.. రచ్చ.. డాక్యుమెంట్స్ చించేసి..
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:39 PM
సిట్ దర్యాప్తులో చెవిరెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నారు. దర్యాప్తు అధికారులనే ఎదురు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పలు డాక్యుమెంట్స్‌ను చించేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
విజయవాడ: మద్యం కుంభకోణం కేసులో వైసీపీ కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సిట్ కార్యాలయంలో మూడు గంటలకు పైగా అధికారులు ఆయనను విచారణ చేశారు. అయితే, సిట్ అధికారులు విచారణ చేసే సమయంలో సమాధానాలు చెప్పకుండా చెవిరెడ్డి ఎదురు ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చదువుకుని సంతకాలు చేయమని ఇచ్చిన డాక్యుమెంట్ లను చెవిరెడ్డి చించివేశారని వార్తలు వినిపిస్తున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను ఏసీబీ కోర్టులో హాజరుపరచిన సిట్ అధికారులు దర్యాప్తు వీడియో ఫుటేజీని ఏసీబీ కోర్టులో సమర్పించారు.
అయితే, మద్యం కుంభకోణం కేసులో తాను విచారణకు సహకరిస్తానని చెప్పినా అరెస్టు చేశారని చెవిరెడ్డి న్యాయాధికారికి విన్నవించారు. విచారణ సమయంలో తాను చెప్పిన జవాబులు కాకుండా వారి సొంతానికి రాసుకున్నారని తెలిపారు. 26 ప్రశ్నలకుఅధికారులు వారికి నచ్చిన సమాధానాలు రాసుకున్నారన్నారు. 27వ ప్రశ్నకు తానే స్వయంగా తీసుకుని పైన జవాబులు నేను చెప్పినవి కాదని రాసినట్లు వెల్లడించారు. ఈ కేసులో తన ప్రమేయం లేదని, విచారణకు ఎప్పుడు పిలిచినా వస్తానని ముందే సమాచారం ఇచ్చానన్నారు. అయినా కూడా కుట్రతోనే తనను అరెస్టు చేశారని ఏసీబీ కోర్టుకు చెవిరెడ్డి తెలిపారు. అయితే, కోర్టు వద్ద తనను అన్యాయంగా అరెస్టు చేశారని, అందరి సంగతి చూస్తానంటూ చెవిరెడ్డి హడావుడి చేసినట్లు తెలుస్తోంది.
Also Read:
ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు: నారా లోకేష్
తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్
For More Telugu News