Share News

Chandrababu: ఎమ్మెల్యే పనితీరు మెరుగుపడాలి

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:01 AM

రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఒక అంచనాకు వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.

Chandrababu: ఎమ్మెల్యే పనితీరు మెరుగుపడాలి

ABN AndhraJyothy: రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఒక అంచనాకు వస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఉదాహరణకు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఈ నియోజకవర్గంలో 7.32 శాతం మెజారిటీతో గెలుపొందాం., కానీ అది 15 శాతానికి పెరిగితే శాశ్వతంగా గెలుస్తాం. అందుకనుగుణంగా ఇక్కడి ఎమ్మెల్యే, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ సభ్యత్వ నమోదులో మార్కాపురం 104 స్థానంలో ఉంది. పేదల సేవా కార్యక్రమాలు ఎనిమిది అమలుచేస్తుండగా అందులో మూడింటిలో ఎమ్మెల్యే బాగా పాల్గొంటున్నారు. పనితీరు ఇంకా మెరుగుపరచుకోవాలి. ప్రభుత్వం గురించి, చేసే మంచి పనుల గురించి ప్రజలకు వివరించడంలో ఆయన వెనుకబడ్డారు.


ఎమ్మెల్యే ఏ స్థాయిలో ఉన్నారో ఇప్పుడు చెప్పను. అవసరమైనప్పుడు చిట్టా విప్పుతా’ అని చెప్పారు. కాగా కార్యకర్తల సమావేశానికి సీఎం రాగానే ఏదో చెప్పేందుకు ఒక కార్యకర్త లేచాడు. ‘ఇక్కడ మీకేం పని! ప్రతి చోటా నా మీటింగ్‌కు వచ్చి అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.. మీ నియోజకవర్గం కాకుండా మరోచోటకు రాకూడదు’ అని చంద్రబాబు సుతిమెత్తగా మందలించి బయటకు పంపారు.

Updated Date - Mar 09 , 2025 | 04:02 AM