Chandrababu Foreign Trip: విదేశీ పర్యటనకు చంద్రబాబు
ABN , Publish Date - Apr 17 , 2025 | 03:58 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. 75వ జన్మదిన వేడుకలను యూరప్‌లో జరుపుకుంటూ, 21న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడినుంచి యూరప్ పర్యటనకు వెళ్తారు. చంద్రబాబుతోపాటు ఆయన సతీమణి భువనేశ్వరి, మంత్రి లోకేశ్ దంపతులు వెళ్లారు. 20న చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను యూర్‌పలోనే జరుపుకోనున్నారు. విదేశీ పర్యటన ముగించుకుని 21న ముఖ్యమంత్రి రాష్ట్రానికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 18 నుంచి 20 వరకూ నిర్వహించనున్న జర్నలిస్టుల క్రికెట్ లీగ్ కప్‌ను సీఎం బుధవారం ఆవిష్కరించారు.