Share News

CM Chandrababu: సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

ABN , Publish Date - Jun 19 , 2025 | 08:16 PM

ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామయ్య మృతి చెందడం బాధాకరమన్నారు.

CM Chandrababu: సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతిపై  సీఎం చంద్రబాబు సంతాపం
CM Chandrababu

అమరావతి: ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామయ్య మృతి చెందడం బాధాకరమన్నారు. పాత్రికేయులుగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, పీఈసీని స్థాపించి ఆ ప్రాంత విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్యను రామయ్య చేరువ చేశారని కొనియాడారు. కంచర్ల శ్రీకాంత్ కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ఈ నేపధ్యంలోనే విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈనాడు రామయ్యగా ప్రసిద్ధులైన ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతి బాధాకరమన్నారు. బహుముఖ ప్రతిభాశాలి అయిన రామయ్య వివిధ రంగాల ద్వారా అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


అలాగే, సీనియర్ జర్నలిస్ట్ కంచర్ల రామయ్య మృతికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంతాపం తెలిపారు. రామయ్య జర్నలిస్టుగా కెరీర్ ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించి విద్యను పేదలకు అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. రామయ్య కుమారుడు ఎమ్మెల్సీ శ్రీకాంత్‌కు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే, పలువురు ప్రముఖలు సైతం రామయ్య మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

Updated Date - Jun 19 , 2025 | 08:21 PM