Birthday Celebration: చంద్రబాబు పుట్టినరోజున తిరుమలలో ఒకరోజు అన్నదానం
ABN , Publish Date - Apr 21 , 2025 | 04:29 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజున తిరుమలలో ఒకరోజు అన్నదానం నిర్వహించారు. భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ రూ.44 లక్షల విరాళం అందజేశారు
రూ.44లక్షల విరాళం అందజేసిన ‘భాష్యం’ అధినేత రామకృష్ణ
తిరుమల/గుంటూరు, ఏప్రిల్20(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆదివారంనాడు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఒకరోజు అన్నదానం చేశారు. భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఇందుకోసం రూ.44 లక్షలు విరాళంగా అందజేశారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు చంద్రబాబు నాయుడు, భాష్యం రామకృష్ణ పేర్లపై ఈ అన్నదానం జరిగింది. టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి దాతతో కలిసి భక్తులకు అన్న ప్రసాదాలను స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాదాల రుచి, నాణ్యతపై నెల్లూరు, గుంటూరు, హైదరాబాద్, కర్నూలు భక్తుల నుంచి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులందరూ రుచి, నాణ్యత అద్భుతంగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు.