Share News

Birthday Celebrations: నేడు బాబు 75వ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Apr 20 , 2025 | 04:13 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు మంగళగిరి ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా కేక్‌ కటింగ్, పాట విడుదల, సేవా కార్యక్రమాలు, పుస్తక ఆవిష్కరణ ఉంటాయి

 Birthday Celebrations:  నేడు బాబు 75వ జన్మదిన వేడుకలు

  • ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా ఏర్పాట్లు

అమరావతి, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 8.30 గంటలకు పార్టీ నాయకులు కేక్‌ కట్‌ చేసి జన్మదిన వేడుకలను ప్రారంభిస్తారు. అనంతరం చంద్రబాబుపై ఇటీవల రూపొందించిన ఓ పాటను విడుదల చేస్తారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మరోవైపు.. అసెంబ్లీ కమిటీ హాలులో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్‌, విక్రమ్‌ పూల రూపొందించిన రెండు పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు తదితరులు హాజరుకానున్నారు.

Updated Date - Apr 20 , 2025 | 04:13 AM