Share News

Centre Accelerates National Highway: జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:35 AM

రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌

Centre Accelerates National Highway: జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం పెద్దపీట

  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

నరసరావుపేట టౌన్‌, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ‘సారథ్యం’ యాత్రలో భాగంగా సోమవారం ఆయన పల్నాడు జిల్లా నరసరావుపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 4,400 కిలోమీటర్ల మేర రహదారుల విస్తరణ పనులు శరవేగంగా జరగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను జాతీయ రహదారితో అనుసంధానం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రూ.5,600 కోట్ల వ్యయంతో విస్తరించే 27 రోడ్లు, ఆర్‌యూబీల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపనలు చేశారన్నారు. అమరావతి ఓఆర్‌ఆర్‌ నిర్మాణంతో రాజధాని ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈనెల 14, 15 తేదీల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగుర వేసేలా ‘హర్‌ఘర్‌ తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నేతలు పాతూరి నాగభూషణం, పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షుడు యేలూరి శశికుమార్‌, ఏబీవీపీ రాష్ట్ర కోశాధికారి కొడూరు సాంబశివరావు తదితరుల పాల్గొన్నారు. కాగా, బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీ ప్రమాదంలో గాయపడి నరసరావుపేటలోని జీబీఆర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాధవ్‌ పరామర్శించారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మందు బాబులకు గుడ్ న్యూస్

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

For More AP News and Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:35 AM