Share News

AP EAPCET 2025: ఇతర బోర్డుల ఇంటర్‌ విద్యార్థులు 30లోపు మార్కులను అప్‌లోడ్‌ చేయాలి

ABN , Publish Date - May 25 , 2025 | 04:31 AM

సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఇ, డిప్లొమా మరియు ఇతర బోర్డుల 10+2 విద్యార్థులు తమ మార్కులను ఈఏపీసెట్ వెబ్‌సైట్‌లో ఈ నెల 30వ తేదీకి అప్‌లోడ్ చేయాలి. మార్కులకు 25% వెయిటేజ్ ఉన్నందున ఇది తప్పనిసరి అని సెట్ చైర్మన్ తెలిపారు.

AP EAPCET 2025: ఇతర బోర్డుల ఇంటర్‌ విద్యార్థులు 30లోపు మార్కులను అప్‌లోడ్‌ చేయాలి

ఏపీ ఈఏపీసెట్‌ చైర్మన్‌ సీఎస్‌ఆర్కే ప్రసాద్‌

జేఎన్టీయూకే, మే 24 (ఆంధ్రజ్యోతి): సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ,, ఏపీవోఎస్ఎస్‌, ఎన్‌ఐవోఎస్‌, డిప్లొమా, ఇతర బోర్డులకు చెందిన 10+2 విద్యార్థులు తమ మార్కులను ఈఏపీసెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా డిక్లరేషన్‌ ఫారంలో ఈ నెల 30వ తేదీలోపు అప్‌లోడ్‌ చేయాలని సెట్‌ చైర్మన్‌, జేఎన్టీయూకే ఉప కులపతి సీఎ్‌సఆర్కే ప్రసాద్‌ తెలిపారు. ర్యాంకుల ప్రక్రియలో మార్కులకు 25శాతం వెయిటేజీ ఉన్నందున తప్పనిసరిగా మార్కులను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఏపీఈఏపీసెట్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష శనివారం ప్రశాంతంగా జరిగిందని, 28,075 మంది విదార్థులకు 26,608 మంది హాజరయ్యారని, 94.77 శాతం హాజరు నమోదైందని తెలిపారు.

Updated Date - May 25 , 2025 | 04:34 AM