Share News

Chandrababu 75 Years: సీబీఎన్‌ పాత్‌వేస్‌టు సక్సెస్‌ పుస్తకావిష్కరణ

ABN , Publish Date - May 20 , 2025 | 05:46 AM

సీఎం చంద్రబాబు జీవిత ప్రస్థానాన్ని వివరించే ‘సీబీఎన్‌ పాత్‌వేస్‌టు సక్సెస్‌’ పుస్తకాన్ని ఆయన స్వయంగా ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డి. రాజేశ్ కుమార్‌, డీ.ఏ. రాజు సంయుక్తంగా రచించారు.

 Chandrababu 75 Years: సీబీఎన్‌ పాత్‌వేస్‌టు సక్సెస్‌ పుస్తకావిష్కరణ

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని వివరిస్తూ ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డి.రాజేశ్‌ కుమార్‌, రీచ్‌ ఎయిట్స్‌ ఈటీ అండ్‌ సీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ డీఏ రాజు సంయుక్తంగా రాసిన ‘సీబీఎన్‌ పాత్‌వేస్‌టు సక్సెస్‌’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. సచివాలయంలో సోమవారం ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకంలో సీఎం చంద్రబాబు జీవితాంశాలు, విజన్‌, విజయసూత్రాలు, అభివృద్ధి విధానాలు వంటి అంశాలను పొందుపరిచారు. కార్యక్రమంలో వీఎన్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ చైర్మన్‌ బన్‌ బాబు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2025 | 05:47 AM