Borugadda Case Postponed: బోరుగడ్డ కేసు విచారణ వాయిదా
ABN , Publish Date - May 01 , 2025 | 04:19 AM
బోరుగడ్డ అనిల్ కుమార్ కేసు విచారణను అనంతపురం మొబైల్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. సాక్షులు రాకపోవడంతో కోర్టు విచారణను వాయిదా వేసింది
అనంతపురం క్రైం, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కేసు విచారణను అనంతపురం మొబైల్ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. 2018లో అనంతపురం త్రీటౌన్ సీఐ మురళీకృష్ణను బెదిరించారన్న అభియోగంపై అనిల్‌పై కేసు నమోదైంది. రిమాండ్ అనంతరం వాయిదాలకు హాజరు కాకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా జైలు నుంచి వీడియో కాల్ ద్వారా బుధవారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. సాక్షులు రాకపోవడంతో మొబైల్ కోర్టు ఇన్‌చార్జి న్యాయాధికారి ప్రతిభ విచారణను వాయిదా వేశారు.