Share News

Narasaraopet Court : బోరుగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

ABN , Publish Date - May 20 , 2025 | 04:52 AM

నరసరావుపేట కోర్టులో రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

 Narasaraopet Court : బోరుగడ్డ బెయిల్‌ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

నరసరావుపేట లీగల్‌/గుంటూరు, మే 19(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు సోమవారం ముగిశాయి. తీర్పును మంగళవారానికి వాయిదా వేస్తూ నరసరావుపేట రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం. గాయత్రి ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లను కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఫిరంగిపురం పోలీస్‌ ేస్టషన్లో బోరుగడ్డపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఇక పెదకాకాని మండల సర్వేయర్‌ను సర్వే సర్టిఫికెట్‌ కోసం బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించిన కేసులో బోరుగడ్డ 8 ఏళ్లుగా కోర్టుకు గెపర్హాజరవుతున్నాడు.

Updated Date - May 20 , 2025 | 04:54 AM