IT Boom In Visakhapatnam: విశాఖకు ఐటీ బూమ్
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:48 AM
రాష్ట్రంలో ఐటీ ఐటీఈఎస్ కంపెనీలు 300 వరకు ఉండగా, వాటిలో సుమారు 50 వేలమంది పనిచేస్తున్నారు.
రాబోయే ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక 14 నెలల కాలంలోనే విశాఖపట్నానికి రూ.24,047 కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రముఖ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇవి అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఒక్క టీసీఎస్ కంపెనీయే 13 వేల ఉద్యోగాలు ఇవ్వనుంది. కాగ్నిజెంట్ మరో 8 వేల ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించింది. డేటా సెంటర్లు అందుబాటులోకి వస్తే ఉద్యోగావకాశాలు ఇంకా పెరుగుతాయి.
పెద్ద కంపెనీలు.. భారీ పెట్టుబడులు!
ఎంఓయూలు అమలైతే 74,100 మందికి ఉద్యోగాలు
ఒక్క టీసీఎస్ కంపెనీయే 13 వేలు
కాగ్నిజెంట్ మరో 8 వేల ఉద్యోగాలు
కూటమి ప్రభుత్వం రాకతో ముందుకొస్తున్న పలు కంపెనీలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐటీ/ఐటీఈఎస్ కంపెనీలు 300 వరకు ఉండగా, వాటిలో సుమారు 50 వేలమంది పనిచేస్తున్నారు. వాటి వార్షిక ఆదాయం రూ.3 వేల కోట్లు. ఐటీ హబ్‌గా ఉన్న విశాఖపట్నంలోనే 200 వరకూ కంపెనీలు ఉన్నాయి. వాటిలో 35 వేలమంది పనిచేస్తున్నారు. రుషికొండలో పదిహేనేళ్ల క్రితం ఐటీ పార్కులు ఏర్పాటు చేసి, కంపెనీలకు రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో ఇది సాధ్యమైంది. అయితే పెద్ద కంపెనీలు విశాఖపట్నం రాకపోవడం వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించడం లేదు. దీనిపై దృష్టి సారించిన ఐటీ శాఖ మంత్రి లోకేశ్ యాంకర్ కంపెనీగా టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స(టీసీఎ్‌స)ను రప్పించారు. కాపులుప్పాడలో 21.6 ఎకరాల భూమితో పాటు తక్షణమే కార్యకలాపాలు ప్రారంభించడానికి రుషికొండ ఐటీ హిల్స్-3లోని మిలీనియం టవర్-బీని ఇచ్చారు. టీసీఎస్ యాజమాన్యం రూ.1370 కోట్ల పెట్టుబడులు పెట్టి, దశలవారీగా 13 వేలమందికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చింది. అదొక్కటే సరిపోదని భావించి, మరో పెద్ద సంస్థ కాగ్నిజెంట్‌తో చర్చలు జరిపి ఒప్పించారు. ఆ సంస్థకు కాపులుప్పాడలో 21.31 ఎకరాలు కేటాయించారు. రూ.1,582.98 కోట్లు పెట్టుబడి పెట్టి, క్రమంగా ఎనిమిది వేలమందికి ఉద్యోగాలు ఇస్తామని కాగ్నిజెంట్ హామీ ఇచ్చింది. తాజాగా వారం క్రితం రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరో ఐదు కంపెనీలకు భారీగా భూములు కేటాయించారు. త్వరలో ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. గతంలోనే కాపులుప్పాడలో అదానీ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. ఇవి కూడా నిర్మాణ పనులు ప్రారంభిస్తే కచ్చితంగా లక్ష ఉద్యోటీవకాశాలు వస్తాయి.
పెద్ద కంపెనీలు కాబట్టి ఉద్యోగాలు గ్యారెంటీ
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగాలు త గ్గిపోతున్నాయి. ఉన్నవారినే తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విశాఖలో కొత్త ఉద్యోగా లు ఎలా ఇస్తారని అనుకునే అవకాశం ఉంది. విశాఖకు రావడానికి ఎంఓయూ లు చేసుకున్నవన్నీ పెద్ద కంపెనీలు. టీసీఎస్ వంటి సంస్థలు వాటి దగ్గర ఎక్కడెక్కడో పనిచేస్తున్న ఉత్తరాంధ్ర ఉద్యోగులను ముందు విశాఖకు పంపిస్తాయి. ఆ తరువాత క్రమంగా కొత్త ఉద్యోగాలు ఇస్తాయి. ఏ టెక్నాలజీకి తగ్గట్టుగా ఇక్కడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
- ఓ నరేశ్‌కుమార్, ఉపాధ్యక్షుడు,
రుషికొండ ఐటీ పార్క్
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News