Share News

Cyber Threat: తస్మాత్‌ జాగ్రత్త

ABN , Publish Date - Oct 30 , 2025 | 05:17 AM

నగరంలో వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో ఒక మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. ‘‘మీ వాహనంపై ఈ-చలాన్‌ జనరేట్‌ అయింది.

Cyber Threat: తస్మాత్‌ జాగ్రత్త

  • ఆర్‌టీఓ చలాన్‌ పేరుతో మాల్వేర్‌.. వాట్సాప్‌లో ఓపెన్‌ చేస్తే మొబైల్‌ హ్యాంగ్‌

విశాఖపట్నం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): నగరంలో వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ‘ఆర్‌టీఓ చలాన్‌’ పేరుతో ఒక మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. ‘‘మీ వాహనంపై ఈ-చలాన్‌ జనరేట్‌ అయింది. వెంటనే చెక్‌ చేసుకోండి. లేదంటే మీపై కోర్టులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అవుతుంది. దీంతో పాటు వచ్చిన ‘ఆర్‌టీఓ ఏపీకే’(ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజ్‌) ఇన్‌స్టాల్‌ చేసుకొని చలానా చెక్‌ చేసుకొండి... ఫ్రమ్‌, ఆర్‌టీఓ ఆఫీస్‌’’ అంటూ మెసేజ్‌ వస్తోంది. దాంతో పాటే ‘ఈ-చలాన్‌ ఆర్‌టీఓ... ఏపీకే’ అని వస్తోంది. చలానా ఎక్కడ పడింది?, ఎంత వేశారు?... తెలుసుకోవాలన్న ఆత్రంతో పొరపాటున ఆ అప్లికేషన్‌ ఓపెన్‌ చేస్తే ప్రమాదమే. అది అనేక పర్మిషన్లు అడుగుతుంది. అవన్నీ ఓకే చేసుకుంటూ పోతే...‘వలంటీర్స్‌ గ్రూపు’ అని ఒకటి ఆటోమేటిక్‌గా మొబైల్‌లో జనరేట్‌ అవుతోంది. అందులో కూడా ఇదే అప్లికేషన్‌ వస్తోంది. అది ఆ మొబైల్‌ నుంచి ఇతర వ్యక్తులకు పంపించకుండానే ఫార్వర్డ్‌ అవుతోంది.

నష్టం ఏమిటంటే...

మొబైల్‌ ఖరీదైనది, మాల్వేర్‌ను అడ్డుకునే శక్తి కలది అయితే ఫర్వాలేదు. లేదంటే వాట్సాప్‌ హ్యాంగ్‌ అయిపోతుంది. పనిచేయదు. మరికొందరికి ఫోన్‌లో బ్యాటరీ చాలా త్వరగా డ్రైయిన్‌ అయిపోతుంది. ఫుల్‌ చార్జింగ్‌ చేసినా అరగంటలోనే 20 శాతానికి వచ్చేస్తుంది. వెంటనే సర్వీసింగ్‌ సెంటర్‌కు వెళ్లి మాల్వేర్‌ను తొలగించి, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేయించుకోవలసి వస్తుం ది. ఈ క్రమంలో ఫోన్‌లో డేటా పోతుంది. సరైన పాస్‌వర్డ్‌లు లేకపోతే అకౌంట్లో డబ్బులు కూడా మాయమైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మొబైల్‌లో ‘ఆర్‌టీఓ ఈ-చలానా’ పేరుతో వచ్చే అప్లికేషన్‌ ఓపెన్‌ చేయకండి. దీనిపై సైబర్‌ పోలీసులు కూడా దృష్టి పెట్టి ప్రచారం చేయాల్సి ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Updated Date - Oct 30 , 2025 | 07:26 AM