Pawan Kalyan: కిరణ్ రాయల్‌పై జనసేన విచారణ
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:39 AM
గత రెండ్రోజులుగా ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొందరు మహిళలకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిపై జనసేన రాష్ట్ర కార్యాలయం ఆదివారం స్పందించింది.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశం
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): తిరుపతి జనసేన ఇన్‌చార్జి కిరణ్ రాయల్‌పై పార్టీపరంగా విచారణకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆదేశించారు. గత రెండ్రోజులుగా ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొందరు మహిళలకు సంబంధించి కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిపై జనసేన రాష్ట్ర కార్యాలయం ఆదివారం స్పందించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా విచారించాలని పార్టీ కాన్‌ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పార్టీ ఆదేశాలు వెలువడేవరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు సృష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై జనసేన నాయకులు దృష్టిపెట్టాలని సూచించారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి