Share News

Chandrababu Vision for Andhra Pradesh: దార్శనికుడు చంద్రబాబు

ABN , Publish Date - Apr 17 , 2025 | 04:12 AM

ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా, ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికుడని ప్రశంసించారు. ప్రత్యేక హోదా అనేది ప్రణాళికాసంఘం ఉన్నప్పుడు మాత్రమే ఉండేదని, 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధించాలని చంద్రబాబు కలలు కంటున్నారని తెలిపారు

Chandrababu Vision for Andhra Pradesh: దార్శనికుడు చంద్రబాబు

  • సమస్యలపై ఆయనలా ప్రజంటేషన్‌ ఇచ్చే నాయకులు అరుదు

  • నిధుల పంపిణీపై ప్రతిపాదనలు ఇచ్చారు

  • జనాభా ప్రాధాన్యం తగ్గించాలని కోరారు

  • ప్రత్యేక హోదాకు ఇప్పుడు స్థానం లేదు

  • అరవింద్‌ పనగారియా వెల్లడి

అమరావతి, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ ముఖ్యమంత్రి దార్శనికుడు. వచ్చే పాతికేళ్లలో దేశం ఎలా ఉండాలనేది ఆయన కలలుగంటారు. 2047నాటి స్వర్ణాంధ్రప్రదేశ్‌ను ఇప్పుడే చంద్రబాబు ఊహిస్తారు’’ అంటూ 16వ ఆర్థిక సంఘం చైర్మన్‌ అరవింద్‌ పనగారియా వ్యాఖ్యానించారు. విజయవాడకు వచ్చిన ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘గత తొమ్మిది నెలలుగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాం. ఇప్పుడు ఏపీకి వచ్చాం. మా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రితో సమావేశమయ్యాం. అమరావతి రాజధాని, దాని చరిత్ర, ప్రాజెక్టుల గురించి సమగ్రంగా ఆయన ప్రజంటేషన్‌ ఇచ్చారు. నేను 2015లో నీతిఆయోగ్‌లో ఉన్నప్పుడు, చంద్రబాబు స్వచ్ఛభారత్‌ మిషన్‌కు ప్రాతినిధ్యం వహించారు. డిజిటలైౖజేషన్‌ కమిటీకి నాయకత్వం వహించారు. బీమ్‌ అప్లికేషన్‌, యూపీఐ సిస్టం ఆయన హయాంలోనే అభివృద్ధి చెందాయి. ఆర్థిక సంఘం ఎదుట విస్తృతమైన ప్రజెంటేషన్లు ఇచ్చే ఇద్దరు, ముగ్గురు నాయకుల్లో చంద్రబాబు ఒకరు’’ అని వివరించారు. ఏపీకి కేంద్రం నుంచి ఇచ్చే వాటా 41శాతం నుంచి 50శాతం వరకు పెంచాలని ఆయన కోరారని తెలిపారు.


ప్రత్యేకహోదా అనేది ప్రణాళికాసంఘం ఉన్నప్పుడు ఉండేదన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడా ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించామన్నారు. రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్న విషయాన్ని సీఎం తమ దృష్టికి తెచ్చారని తెలిపారు. ఏపీ సహా రాష్ట్రాల ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయాలు తీసుకోలేదని, విస్తృత సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. సమావేశంలో ఆర్థికసంఘం సభ్యులు మనోజ్‌ పాండా, అన్నే జార్జ్‌ మాథ్యూ, రాష్ట్ర ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి జె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


Read Also: Career Tips: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జీతం పెంచుకునేందుకు అదిరిపోయే టిప్స్

ISRO Vacancies: ఇస్రోలో నాన్ టెక్నికల్ పోస్టులకు నోటిఫికేషన్.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Bank Jobs: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..ముసలోళ్లు అప్లై చెయ్యెచ్చు

Updated Date - Apr 17 , 2025 | 04:12 AM