Share News

Katamneni Bhaskar: డేటా అనుసంధానంతో అద్భుత ఫలితాలు

ABN , Publish Date - Feb 26 , 2025 | 05:10 AM

ప్రభుత్వ శాఖల డేటా అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ అన్నారు.

 Katamneni Bhaskar: డేటా అనుసంధానంతో అద్భుత ఫలితాలు

  • సీడీటీవోల నియామకాలు తక్షణమే చేపట్టండి

  • ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ ఆదేశాలు

అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖల డేటా అనుసంధానంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆర్టీజీఎస్‌ కార్యదర్శి కాటంనేని భాస్కర్‌ అన్నారు. ఈ మేరకు అన్ని శాఖలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆర్టీజీఎ్‌సకు అనుసంధానం చేయాలని ఆదేశించారు. మంగళవారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని శాఖల నుంచి అసమగ్రంగా డేటా వస్తోందని అసహనం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ డేటాను కూడా ఆర్టీజీఎ్‌సకు పంపాలని స్పష్టం చేశారు. అలసత్వం, జాప్యం లేకుండా ప్రజలకు సేవలందించేలా డేటాను పంపాలని కోరారు. ఈ నెలాఖరులోగా గూగుల్‌తో సంప్రదించి ఆర్టీసీ బస్సుల్లో త్వరలో జీపీఎస్‌ విధానం అమలయ్యేలా చూడాలని భాస్కర్‌ సూచించారు.

Updated Date - Feb 26 , 2025 | 05:11 AM