Share News

PSR Anjaneyulu: ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎ్‌సఆర్‌కు వైద్యం

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:10 AM

ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 కేసులో విజయవాడ జైల్లో రిమాండ్‌ ఖైదీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయనను రాత్రికి జైలుకు తిరిగి తరలించారు.

PSR Anjaneyulu: ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎ్‌సఆర్‌కు వైద్యం

బీపీలో హెచ్చుతగ్గులు, నిద్రలేమి సమస్యలకు చికిత్స

విజయవాడ, మే 31(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్‌ 1 కేసులో విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న పీఎ్‌సఆర్‌ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉంటున్నాయని చెప్పడంతో ఆయనను జైలు అధికారులు శనివారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాత్రి పూట నిద్ర పట్టడం లేదని, కళ్లు తిరుగుతున్నాయని వైద్యులకు పీఎ్‌సఆర్‌ వివరించారు. దీంతో ఆయనను సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ వార్డులో చేర్చి అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆస్పత్రిలో చేరేటప్పుడు ఎస్కార్ట్‌ సిబ్బందితో పీఎ్‌సఆర్‌ వాగ్వాదానికి దిగారని తెలిసింది. తనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించాలని ఆయన కోరారని సమాచారం. దానికి కోర్టు అనుమతి అవసరమని చెప్పడంతో ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అబ్జర్వేషన్‌ పూర్తయిన అనంతరం పీఎ్‌సఆర్‌ను రాత్రికి జైలుకు తరలించారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:10 AM