APNGGO: ఏపీఎన్‌జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యాసాగర్
ABN , Publish Date - May 23 , 2025 | 05:48 AM
ఆంధ్రప్రదేశ్ నాన్ గజిటెడ్ అండ్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 30న జరుగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పదవీ విరమణ కారణంగా ఎ.విద్యాసాగర్ నాయకత్వాన్ని übernehmen చేసే అవకాశం ఉంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ఆయనకు అన్ని జిల్లాల నేతల మద్దతు ఉన్నది.
30న అధ్యక్ష ఎన్నికలు.. ఎన్నిక లాంఛనమే!
విజయవాడ , మే 22(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ నాన్ గజిటెడ్ అండ్ గజిటెడ్ ఉద్యోగుల సంఘం (ఏపీఎన్‌జీజీఓ) రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు కేవీ శివారెడ్డి పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో, సంఘం బాధ్యతల నుంచి కూడా తప్పుకోవాల్సి వస్తోంది. ఈ నెల 30వ తేదీన ఏపీఎన్‌జీజీఓ సంఘ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం సంఘ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎ.విద్యాసాగర్‌నే రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవటం లాంఛనమని తెలుస్తోంది. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీలేని వ్యవహారశైలి ఉండటం కారణంగా ఆయన వైపే అన్ని జిల్లాల నాయకత్వాలు మొగ్గు చూపిస్తున్నాయి. శివారెడ్డి పదవీ విరమణతో సాగర్ పేరు రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో విద్యాసాగర్ పేరును సమష్టిగా జిల్లాల నాయకత్వాలు ప్రతిపాదించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బహిష్కరించిన పాక్
For National News And Telugu News