Share News

APJAC: సీపీఎస్‌ ఉద్యోగులపై అక్రమ కేసులు ఉపసంహరించండి

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:33 AM

ఏపీజేఏసీ సీపీఎస్‌ ఉద్యోగులపై గత వైసీపీ ప్రభుత్వంలో బనాయించిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు వినతి పత్రం అందజేసింది. 3023 కేసులపై ప్రాసెస్ చేయడం కోసం డీజీపీ హామీ ఇచ్చారు

APJAC: సీపీఎస్‌ ఉద్యోగులపై అక్రమ కేసులు ఉపసంహరించండి

  • వైసీపీ ప్రభుత్వంలో బనాయించిన కేసులపై డీజీపీకి ఏపీజేఏసీ వినతి

అమరావతి, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): సీపీఎస్‌ ఉద్యోగులపై గతంలో బనాయించిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని ఏపీజేఏసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు వినతి పత్రం అందజేసింది. ఏపీజేఏసీ చైర్మన్‌, ఏపీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు, కేవీ శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్‌, ఏపీసీపీఎ్‌సఈఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎం దాస్‌లు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించిన 3,023 కేసుల వివరాలను డీజీపీకి అందించామని తెలిపారు. ఈ కేసుల విషయంలో ప్రాసెస్‌ చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక పంపుతామని డీజీపీ హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీపీఎస్‌ ఉద్యోగులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలోనే ప్రకటించిన విషయాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం కూడా దీనిపై త్వరగా నిర్ణయం తీసుకుని సీపీఎస్‌ ఉద్యోగులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని వారు కోరారు.


Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2025 | 04:33 AM