Share News

Krishna River Management Board: తక్షణమే అమరావతికి రండి

ABN , Publish Date - May 15 , 2025 | 03:25 AM

కృష్ణా నది యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయాన్ని తక్షణమే అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను కోరింది. దీనికి సంబంధించిన లేఖ జలవనరుల శాఖ అధికారులు KRMB చైర్మన్‌కు పంపించారు.

Krishna River Management Board: తక్షణమే అమరావతికి రండి

కార్యాలయం పరిశీలనకు అధికారులను పంపండి

కేఆర్‌ఎంబీ చైర్మన్‌కు జలవనరుల శాఖ ఈఎన్‌సీ లేఖ

అమరావతి/హైదరాబాద్‌, మే 14(ఆంధ్రజ్యోతి): కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయా న్ని తక్షణమే అమరావతిలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్ర భుత్వం కోరింది. ఈ మేరకు బోర్డు చైర్మన్‌ అతుల్‌జైన్‌కు జల వనరుల శాఖ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. ‘హైదరాబాద్‌ దాటి రాలేరా?’ శీర్షికతో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై జలవనరుల శాఖ స్పందించింది. 2020 అక్టోబరు 6న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు తక్షణం బోర్డు ను ఏపీకి తరలించాలని కోరారు. హెడ్‌క్వార్టర్‌ను అమరావతికి మార్చాలని పలుమార్లు కోరామని ఈఎన్‌సీ పేర్కొన్నారు. అధికారుల బృందాన్ని విజయవాడకు పంపాలని ఆ లేఖలో వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కాగా, జలవనరుల శాఖ ఇంజనీరింగ్‌ విభాగంలో ముగ్గురు చీఫ్‌ ఇంజనీర్లకు ఈఎన్‌సీ(ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌)గా పదోన్నతులు కల్పించారు. ఇరిగేషన్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌గా ఉన్న ఎం.వెంకటేశ్వరరావు స్థానంలో కె.నరసింహమూర్తిని నియమించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్

Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:25 AM