Share News

Drug Control: గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు సాంకేతికతను వినియోగించాలి

ABN , Publish Date - Jul 30 , 2025 | 04:39 AM

కేంద్ర, రాష్ట్ర విభాగాల సమన్వయంతో గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు.

Drug Control: గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు సాంకేతికతను వినియోగించాలి

అమరావతి, జూలై 29(ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర విభాగాల సమన్వయంతో గంజాయి, డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర స్థాయి రెండో త్రైమాసిక నార్కో కోఆర్డినేషన్‌ టీమ్‌ (ఎన్సీఓఆర్డీ) సమావేశం సీఎస్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ... ‘గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండేందుకు యువతకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలి. వీటి నియంత్రణకు ఈగల్‌ టీమ్‌ పెద్ద ఎత్తున సాంకేతికతను వినియోగించాలి. ఉత్తరాంధ్రలో గంజాయి సాగు నియంత్రణకు సాంకేతికతను వినియోగిస్తున్నారు. గంజాయికి బదులు కాఫీ, సిల్వర్‌ ఓక్‌ వంటి మొక్కలను అందించి, గిరిజనుల జీవనోపాధికి తోడ్పడటం అభినందనీయం’అనిఅన్నారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గు ప్తా మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్‌ నియంత్రణకు అంతర రాష్ట్ర చెక్‌పోస్టులను ప టిష్ఠం చేయాల్సి ఉందన్నారు. ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ మాట్లాడుతూ, ఇప్పటి వర కు 911 కేసులు నమోదు చేసి, గంజాయి, వాహనాలను పట్టుకున్నట్లు వివరించారు.

Updated Date - Jul 30 , 2025 | 04:39 AM