Andhra Pradesh Broken Rice: ఎఫ్‌సీఐకి పది శాతం నూకలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:28 AM
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యం మేరకు పది శాతం బ్రోకెన్ రైస్...
ఐదు రాష్ట్రాల నుంచి సేకరిస్తున్న కేంద్రం: మనోహర్
అమరావతి, జూలై 17(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన లక్ష్యం మేరకు పది శాతం బ్రోకెన్ రైస్ (నూకలు)ను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కి సరఫరాల చేసేందుకు మిల్లర్లు సిద్ధంగా ఉండాలని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. విజయవాడలోని సివిల్ సప్లయిస్ భవన్‌లో గురువారం రైస్ మిల్లర్ల ప్రతినిధులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏపీతోపాటు హర్యానా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి 10 శాతం బ్రోకెన్ రైస్‌ను కేంద్రం సేకరిస్తోందన్నారు. మన రాష్ట్రం నుంచి బ్రోకెన్ రైస్ సరఫరా చేసేందుకు మిల్లర్లు ప్రతిపాదనలు ఇవ్వాలన్నారు. ఇందుకు అవసరమైన టెస్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్‌ఫోర్ట్ ఏర్పాట్లను ముందుగానే చేసుకుని, గడువులోగా సరఫరా చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు జిల్లాల్లో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతమైందని చెప్పారు. కమిషనర్ సౌరభ్‌గౌర్, కార్పొరేషన్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్