AP Solar Farming Policy: సోలార్ ప్యానెళ్ల కింద సాగు
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:27 AM
సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సోలార్ ప్యానెళ్లను పొలాల్లో ఏర్పాటు చేసుకుని..
వ్యవసాయ వర్సిటీలతో ఒప్పందాలు
ఎన్‌ఆర్‌ఈడీఏపీ, ఇంధన సంస్థలు వెల్లడి
త్వరలో ‘అగ్రివోల్టాయిక్స్’ పాలసీ
అమరావతి, జూలై 23(ఆంధ్రజ్యోతి): సౌరశక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చే సోలార్ ప్యానెళ్లను పొలాల్లో ఏర్పాటు చేసుకుని.. ఆ ప్యానెళ్ల కింద ఎంపిక చేసిన పంటలను సాగు చేసుకునే విధానాన్ని రాష్ట్రంలో ప్రోత్సహించనున్నారు. తద్వారా సౌరవిద్యుత్ ఉత్పత్తితోపాటు రైతులు పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహా సాగును ‘అగ్రివోల్టాయిక్స్’గా పేర్కొంటారు. ప్రస్తుతం ఈ విధానం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తృతంగా అమలవుతోంది. దీనిని ఏపీలోనూ ప్రోత్సహించాలని కేంద్ర, రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖలు యోచిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ డెవల్‌పమెంట్ సంస్థ(ఎన్‌ఆర్‌ఈడీఏపీ) ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించి బుధవారం విజయవాడలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు, డెవలపర్లు, సోలార్ ప్యానళ్ల తయారీదారులు, మేథావులతో నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎ్‌సఈఎ్‌ఫఐ), ఎన్‌ఆర్‌ఈడీఏపీలు సంయుక్తంగా సదస్సును నిర్వహించాయి. అగ్రివోల్టాయిక్స్ విధానంతో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఎన్‌ఆర్‌ఈడీఏపీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.కమలాకరబాబు చెప్పారు. రాష్ట్రంలో అగ్రివోల్టాయిక్స్ విధానాన్ని అమలు చేసేలా ‘పాలసీ’ని రూపొందిస్తున్నామన్నారు. కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగం వ్యవసాయోత్పత్తులను ప్రోత్సహిస్తున్నాయని ఎన్‌ఎ్‌సఈఎ్‌ఫఐ అధ్యక్షుడు పులిపాక సుబ్రహ్మణ్యం తెలిపారు. అగ్రివోల్టాయక్స్‌తో ఇంధన, వ్యవసాయరంగాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
దోసకాయను ఉప్పుతో తింటున్నారా? ఈ ముఖ్య విషయం తెలుసుకోండి.!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి.. లేదంటే..!